ఘనంగా గురునానక్‌ జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గురునానక్‌ జయంతి

Nov 24 2026 11:56 PM | Updated on Nov 24 2026 11:56 PM

నిర్మల్‌టౌన్‌: పట్టణంలోని బోయివాడ గురుద్వార్‌లో మంగళవారం గురునానక్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. సిక్కులు గురుద్వార్‌ను ప్రత్యేకంగా అలంకరించి గురునానక్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురునానక్‌ బోధించిన ప్రేమ, శాంతి, సమానత్వం, మానవత్వం, సేవాభావం వంటి ఆదర్శాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. గురునానక్‌ జయంతి పురస్కరించుకొని సిక్కు యువకులు పట్టణంలో ద్విచక్ర వాహనం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, గురుద్వారా జిల్లా అధ్యక్షుడు గురుసింగ్‌ భాటియా, ఉపాధ్యక్షుడు పరంజిత్‌ సింగ్‌, ప్రధాన కార్యదర్శి సురేశ్‌శెట్టి, కార్యదర్శి అజిత్‌సింగ్‌, సభ్యులు జిత్‌సింగ్‌, అర్మీత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement