నిర్మల్‌టౌన్: బాలికలు విద్యతోపాటు తమ హక్కులు, చట్టాలు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా షెడ్యూల్డ్ కులా ల అభివృద్ధి అధికారి దయానంద్ సూచించా రు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్‌లోని షెడ్యూల్డ్ కులాల కళాశాల బాలికల వసతి గృహంలో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ పథకంపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. బాలికల సాధికారత, బాల్య వివాహాల నిరోధక చట్టం, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం, సైబర్ నేరాలు, సఖి, చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలు, ఆడపిల్లల చదువు ప్రాముఖ్యత, లింగ వివక్షత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ఋతుక్రమ పరిశుభ్రతపై విద్యార్థినులకు వివరించారు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు పల్లవి, సౌమ్య, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్టులు జ్యోతి, మౌనిక, భరోసా లీగల్ ఆఫీసర్ అర్చన, షీ టీం కానిస్టేబుల్ విజయలక్ష్మి, విద్యార్థినులు పాల్గొన్నారు.


