పుష్కరాల పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పుష్కరాల పనుల్లో వేగం పెంచాలి

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

● దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజా రామయ్యర్‌

నిర్మల్‌టౌన్‌: గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శైలజా రామయ్యర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావుతో కలిసి కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నూతన ఘాట్ల నిర్మాణం, పాత ఘాట్ల మరమ్మతులు, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు ప్రాధాన్యతతో చేపట్టాలన్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట అటవీ అనుమతులు పొందాలని, భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. పుష్కరాల పనులన్నీ గడువులోగా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంస్థల అదనపు కలెక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, ఉద్యానవన పంటల అధికారి రమణ, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ శాఖల ఈఈలు సుభాష్‌, అనిల్‌, సీపీవో గంగారెడ్డి, బాసర ఆలయ ఈవో అంజనాదేవి, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement