బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి

Nov 24 2026 1:00 AM | Updated on Nov 24 2026 1:00 AM

నిర్మల్‌టౌన్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల కోసం కేటాయించిన బ్యాక్‌లాగ్‌ ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని నిర్మల్‌ జిల్లా బధిరుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంఘం సభ్యులు కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌–4, నాన్‌ గ్రూప్‌–4 పోస్టుల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల రిజర్వేషన్‌ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నియామక డ్రైవ్‌–2026 నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. బధిరులు, వినికిడి లోపం ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శాఖల వారీగా బ్యాక్‌లాగ్‌ ఖాళీల వివరాలు ప్రకటించి, దివ్యాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అనంతరం జిల్లా ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ జానకీషర్మిలకు వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్‌, ప్రధాన కార్యదర్శి నరేశ్‌, వనిత, కార్తీక్‌, వినాయక్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement