సాంగ్, స్లోగన్ రాయండి.. క్యాష్‌ ప్రైజ్‌ గెలుచుకోండి

National Voter Awareness Contest by Election Commission of India - Sakshi

ఓటరు అవగాహనకు పోటీలు

సాక్షి, హైదరాబాద్‌: ఓటరు చైతన్య కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న వివిధ పోటీలకు మార్చి 15వ తేదీ వరకు గడువుందని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మై ఓట్‌ ఈజ్‌ మై ఫ్యూచర్‌–పవర్‌ ఆఫ్‌ వన్‌ ఓట్‌’ పేరిట జాతీయస్థాయిలో తొలిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సాంగ్, వీడియో మేకింగ్, పోస్టర్‌ డిజైన్, స్లోగన్, క్విజ్‌ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. 

వీటిల్లో సాంగ్, వీడియో మేకింగ్, పోస్టర్‌ డిజైన్‌ పోటీలను మూడు కేటగిరీల్లో (ఇనిస్టిట్యూషనల్, ప్రొఫెషనల్, అమెచ్యూర్‌) నిర్వహిస్తున్నారు. మొదటి, ద్వితీయ, తృతీయ, ప్రత్యేక గుర్తింపుగా నగదు బహుమతులున్నాయి. ఇనిస్టిట్యూషన్‌ కేటగిరీలో నాలుగు ప్రత్యేక గుర్తింపు బహుమతులుండగా, మిగతా విభాగాల్లో మూడు ప్రత్యేక గుర్తింపు బహుమతులున్నాయి. రూ.2 లక్షల నుంచి 10 వేల వరకు బహుమతులు అందుకునే అవకాశం ఉంది.  

స్లోగన్‌ విభాగంలో మొదటి బహుమతి, రూ.20వేలు, రెండో బహుమతి రూ. 10వేలు, మూడో బహుమతి రూ.7,500. క్విజ్‌ పోటీలో విజేతలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి విలువైన బహుమతులు, బ్యాడ్జిలు అందజేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. మూడు స్థాయిల్లో పాల్గొన్న వారందరికీ ఈ–సర్టిఫికెట్టు అందజేయనున్నట్లు తెలిపింది. పోటీలో పాల్గొనాలనుకునేవారు పూర్తి  వివరాల కోసం voterawarenesscontest.in చూడవచ్చునని పేర్కొంది. (చదవండి: కరోనాకు వేవ్‌లు లేవు... వేరియంట్లే)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top