10 రోజులుగా పత్తాలేని పిల్లి.. అన్నం ముట్టని తల్లి.. స్కూల్‌కు వెళ్లని పిల్లలు, దాంతో..

Nalgonda: Man Complained In police Station That Cat Was Missing - Sakshi

సాక్షి, యాదగిరిగుట్ట రూరల్‌: పిల్లి అపహరణకు గురైందని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన గుజ్జుల రాంచంద్రారెడ్డికి జంతువులంటే ఇష్టం. కొంతకాలంగా ఇంట్లో ఒక పిల్లిని పెంచుతున్నాడు. ఆ పిల్లిని తమ కుటుంబసభ్యుల్లో ఒకటిగా భావించి జిమ్మి అని పేరు పెట్టి ప్రేమానురాగాలతో చూసుకుంటున్నారు.
చదవండి: ‘ఎగబడి కరుస్తున్నాయ్‌.. కుక్కలే కదా చంపితే ఏమవుతుందిలే’

అయితే ఆ పిల్లి గత నెల 29న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పిల్లి రాకపోవడంతో తన తల్లి గాలమ్మ రెండు రోజులుగా భోజనం చేయడం లేదని, పిల్లలు యశ్వంత్, తనీష్‌ స్కూల్‌కి వెళ్లడం లేదని, అన్నం కూడా తినడం లేదని రాంచంద్రారెడ్డి తెలిపాడు. పిల్లిని గుర్తించి అపహరించిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జానకిరెడ్డి తెలిపారు. 
చదవండి: బైకుతో సహా నాలాలో పడిన వ్యక్తి.. లక్‌ జగదీష్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top