ఎన్‌ఎండీసీ చైర్మన్‌గా శ్రీధర్‌ నియామకం

Nadimetla Sridhar Appointed As Chairman Of NMDC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి సీఎండీ నడిమెట్ల శ్రీధర్‌కు మరో గౌవరం దక్కింది. నేషనల్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NMDC) చైర్మన్‌గా శ్రీధర్‌ నియామకమయ్యారు. 

వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఎన్‌ఎండీసీ చైర్మన్‌గా శ్రీధర్‌ను నియమించాలని సిఫారసు చేసింది. దీంతో కేంద్రం శ్రీధర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శ్రీధర్‌ ప్రస్తుతం సింగరేణి సీఎండీగా కొనసాగుతున్నారు. శ్రీధర్‌ 1997 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. తెలంగాణ ఏర్పాట తర్వాత నుంచి 2015 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. 

ఇది కూడా చదవండి: నాగ్‌పూర్‌ టూ విజయవాడ: ఎకనమిక్‌ కారిడార్‌కు లైన్‌క్లియర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top