త్వరలోనే మున్నూరు కాపు కార్పొరేషన్‌

Munnuru Kapu Corporation Soon: Vaddiraju Ravichandra - Sakshi

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర 

కాచిగూడ:  మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం అనుకూలంగా ఉన్నారని, త్వరలోనే కార్పొరేషన్‌ ఏర్పాటవుతుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలోని మున్నూరు కాపు భవన్, మ్యాడం అంజయ్య హాల్‌లో మున్నూరు కాపు ప్రజాప్రతినిధుల సత్కార కార్యక్రమం మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్‌ రావు అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌ బోర్డును త్వరలోనే దేవాదాఖ శాఖ పరిధి నుంచి బయటకు తీసుకువస్తామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలో చర్చించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్నూరుకాపులందర్ని ఏకం చేయడం జరుగుతుందని, ఆ దిశగా ప్రయత్నాలను మొదలుపెట్టి 90 శాతం వరకు పూర్తి చేశామని అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకారా అభివృద్ధి సంస్థ చైర్‌ పర్సన్‌ ఆకుల లలిత, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్, మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్, జెల్లి సిద్దయ్య, దామేర జ్ఞానేశ్వర్, మామిండ్ల శ్రీనివాస్, బండి పద్మ, రాకేష్, కొండూరు వినోద్‌కుమార్, గంగం రవి, చింతపండు మల్లేష్, ఎనుగుల మాణిక్‌ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top