ఎంబీబీఎస్‌ విద్యార్థినికి ఎంపీ కోమటిరెడ్డి ఆర్థికసాయం | MP Komatireddy Venkat Reddy Financial Aid For MBBS Student In Nalgonda | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ విద్యార్థినికి ఎంపీ కోమటిరెడ్డి ఆర్థికసాయం

Nov 15 2022 3:06 AM | Updated on Nov 15 2022 10:18 AM

MP Komatireddy Venkat Reddy Financial Aid For MBBS Student In Nalgonda - Sakshi

విద్యార్థినికి ఆర్థికసాయం అందిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని మాధవనగర్‌ ప్రాంతానికి చెందిన ఊట్కురి రుక్కయ్య కూతురు శ్రీలక్ష్మి ఇటీవల ఎంబీబీఎస్‌లో సీటు సాధించినప్పటికీ చేరేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు.  శ్రీలక్ష్మి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని హామీ ఇవ్వడంతో పాటు మొదటగా రూ.లక్షా యాభై వేలు సోమవారం  హైదరాబాద్‌లోని తన నివాసంలో అందజేశారు.

ఎంపీ కోమటిరెడ్డి  తమకు దేవుడిలా సహాయం అందించారని, తమ కుటుంబం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుందని రుక్కయ్య అన్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఎంబీబీఎస్‌ విద్యార్థిని శ్రీలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement