కామ్‌గా ఉంటే కబళించే దోమ కాటు.. క్యూలెక్స్‌, ఏడిస్‌, అనాఫిలిస్‌తో జరపైలం!

Monsoon Diseases Culex And Aedes Anopheles Mosquito Bite Precautions - Sakshi

నేరడిగొండ (ఆదిలాబాద్‌): వర్షాకాలం కావడంతో దోమల సీజన్‌ మొదలైంది. చిన్నదోమే కదా.. కుడితే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. దోమల నివారణ, నియంత్రణపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అనారోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 

దోమల వ్యాప్తితో ప్రమాదం..
ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీటి గుంతలు, కంప చెట్లు, పిచ్చిమొక్కలు, నీరు నిల్వ ఉండే ప్రా ంతాల్లో దోమలు నివాసం ఏర్పర్చుకుంటాయి. గు డ్డు, లార్వా, ప్యూపా వృద్ధి చెంది దోమగా మారి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఈప్రమాదాన్ని ని వా రించాలంటే నీటిని సక్రమంగా వినియోగించా లి. దోమల నివారణకు మందులు పిచికారీ చేయాలి. 

నిర్లక్ష్యం చేస్తే.. 
క్యూలెక్స్‌తో దోమ కాటుతో హఠాత్తుగా జ్వరం వస్తుంది. విస్తారమైన నీటి నిల్వలో పెరిగే క్యూలెక్స్‌ దోమతో ఈవైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈవ్యాధిని చికిత్స ద్వారా నియంత్రించడం కష్టం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మేలు. పంట పొలాలు, పెద్ద పెద్ద స్థలాలు, మైదానాల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పందులను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. 

ఏడిస్‌ దోమతో..  1
ఆకస్మాత్తుగా ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం వస్తుంది. తగ్గినట్లుగానే తగ్గి వారం లేదా పది రోజుల్లో మళ్లీ తిరగబెడుతుంది. ఏడిస్‌ దోమ కాటు కారణంగా ఈవ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాళ్లలో నొప్పి, శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడుతాయి. డెంగీ, చికెన్‌గున్యా వ్యాధి లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. నెలల తరబడి నొప్పులు బాధిస్తాయి. దీని నివారణ కోసం దోమల పెరుగుదలను అరికట్టాలి. ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగించాలి. వ్యాధి పట్ల సరైన అవగాహన పెంచుకొని తగిన చికిత్స చేయించుకోవాలి.

దోమ కాటుకు గురైతే..
అనాఫిలిస్‌ దోమ కాటుతో మలేరియా, చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. వ్యాధి ప్రారంభంలో సరైన చికిత్స చేయించకపోతే నెలల తరబడి బాధిస్తుంది. గర్భిణులకు, చిన్నారులకు ఈవ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. చలితో జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్ధారించుకోవాలి. సకాలంలో మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top