Monkeypox: భద్రాద్రి జిల్లాలో మంకీపాక్స్‌ కలకలం!

Monkeypox Suspect from Bhadradri Admitted Kothagudem - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో మంకీ పాక్స్‌ హైరానా నెలకొంది. మణుగూరు మండలంలోని విజయనగరం గ్రామానికి  చెందిన ఓ విద్యార్థికి మంకీ పాక్స్ లక్షణాలు అగుపించాయి. దీంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. 

మధ్యప్రదేశ్‌లో చదువుతున్న విద్యార్థి..  రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. అయితే అతనిలో జ్వరం, ఇతర మంకీ పాక్స్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో మణుగూరు ప్రభుత్వ వైద్యాధికారి సూచనల మేరకు కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. 

ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటలో అతని రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ సిరం ఇనిస్టిట్యూట్‌కు పంపిస్తున్నారు వైద్యులు. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య ఇదే తరహాలో టెస్టులకు పంపించగా.. నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి: మంకీపాక్స్‌ను తేలిగ్గా తీసుకోవద్దు.. అమెరికాలో హెల్త్‌ ఎమర్జెన్సీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top