సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆర్మూర్‌లో బీఆర్ఎస్‌లోకి మైనార్టీలు చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న రెండు వేల రుపాయల ఫించను రూ. 4000 చేస్తామని ప్రజాప్రభుత్వ హామీ ఇచ్చింది అది నెరవేర్చిందా అని ప్రశ్నించారు.
ప్రజాప్రభుత్వం ఏర్పడి 24 నెలలకు కావస్తున్న ఫించన్ పెంపు దాఖలు లేవన్నారు. మహిళలకు ఇస్తానన్న తులం బంగారం జాడకనిపించడం లేదని దుయ్యబట్టారు.విద్యార్థులకు స్కూటీలు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఇప్పుడు వాటి పేరు ఎత్తడం లేదన్నారు. యువతను ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం వాటిని అమలు చేసే స్థితిలో లేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.


