ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు

Minister Sabitha Indra Reddy Opportunities To Inter Students In Software Field - Sakshi

హెచ్‌సీఎల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం 

ఏటా ప్రభుత్వ కళాశాలల్లోని 20వేల మంది విద్యార్థులకు చాన్స్‌ 

మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ సంవత్సరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ల్లోని 20 వేల మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు.

ఈ అంశంపై ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియెట్‌ బోర్డు ఇన్‌చార్జి కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌తో గురువారం మంత్రి సమీక్షించారు. గణితం సబ్జెక్టు కలిగి ప్ర భుత్వ జూనియర్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో  60 శాతం మార్కు లు పొందిన విద్యార్థులకు  ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు.

ఎంపికైన వారికి ఆన్‌లైన్‌లోనే ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారని, అది పూర్తయ్యాక హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కార్యాలయంలో ఆరు నెలలపా టు ఇంటర్న్‌షిప్‌ ఉంటుందన్నారు. ఇంటర్న్‌షిప్‌లో నెల కు రూ.10 వేలు ఉపకారవేతనం ఇస్తారని, ఆ తర్వాత రూ. 2.5 లక్షల వార్షిక వేతనంతో పూర్తిస్థాయి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 15న ప్రారంభమయ్యే ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top