ఇకపై ఏటా ఉద్యోగాల భర్తీ: మంత్రి హరీశ్‌రావు

Minister Harish Rao Said 50 Thousand Jobs For Unemployed Youth In TS - Sakshi

సాక్షి, సిద్దిపేట: త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని, ఇక నుంచి ప్రతిఏడాది ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. గురువారం సిద్దిపేటలో దాశరథి కృష్ణమాచార్య జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, కొత్తగా 64 వేల ఉద్యోగాలు సృష్టించామన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’అన్న దాశరథి స్ఫూర్తితో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో కరువు అనేది లేకుండా పోయిందన్నారు. 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించి దేశంలో మొదటి స్థానంలో నిలిచామని హరీశ్‌ వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top