వైద్య విద్యార్థులకు శుభవార్త చెప్పిన హరీష్‌ రావు | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థులకు శుభవార్త చెప్పిన హరీష్‌ రావు

Published Mon, Mar 14 2022 12:00 PM

Minister Harish Rao Comments About Medical Colleges At Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 60 ఏళ్ళలో తెలంగాణలో 3 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. 6 ఏళ్ళ‌లో 33 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న 700 ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య‌ను.. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి ఈ సంఖ్య 2,850కి పెంచుకోవ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. అదే విధంగా యూజీ సీట్లు 1640కి, పీజీ సీట్లు 934కు పెంచ‌డం జ‌రిగింద‌న్నారు.

ఈ మేరకు శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటుపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి హ‌రీశ్‌రావు స‌మాధానం ఇస్తూ.. కేంద్రం తెలంగాణ‌పై నిర్ల‌క్ష్యం వ‌హిస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా 171 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేస్తే.. తెలంగాణ‌కు ఒక్క కాలేజీ ఇవ్వ‌కుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. 

నిమ్స్‌లో ప్ర‌స్తుతం 1400 ప‌డ‌క‌లు ఉన్నాయని, మ‌రో 2 వేల ప‌డ‌క‌లు అద‌నంగా ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మెడిక‌ల్ కాలేజీల‌లో డెడ్ బాడీల కొర‌త ఉందని,  చ‌ట్ట స‌వ‌ర‌ణ చేసి డెడ్ బాడీల‌ను మెడిక‌ల్ కాలేజీల‌కు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 33 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని, కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడిక‌ల్ కాలేజీల‌లో ఈ స‌ంవత్స‌రమే క్లాసులు ప్రారంబిస్తామని వెల్లడించారు.
చదవండి: రెండోసారి మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి

Advertisement
Advertisement