సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వంపై తప్పుడు కథనాలు రాసిన ఎబీఎన్ రాధాకృష్ణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వీకెండ్ స్టోరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి టెండర్ల విషయంలో అనేక అపోహలు సృష్టించారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే ఆ టెంటర్లు రద్దు చేశామన్నారు.
ఏబీఎన్ రాధాకృష్ణ తెలంగాణ ఆత్మ సింగరేణి పై కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. పెట్టుబడులు - కట్టుకథలు - విషపు రాతలతో రాధాకృష్ణ రేపిన తప్పుడు ప్రచారంతో మొదలయింది. రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు రాతలు- విషపు రాతలు రాశారన్నారు. ఏ రాబందులు- గద్దలు- దోపిడీ దారుల ప్రయోజనాల కోసం కథనాలు వస్తున్నాయని ప్రశ్నించారు. తొలిపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో చెప్పాలన్నారు.
ప్రభుత్వం పై నిందలు మోపి రాష్ట్రానికి- సింగరేణి కి నష్టం చేస్తున్నారని, రాధాకృష్ణ ఊహగాన కథనాలు రాశారన్నారు. కథనం రాగానే ఒకాయన లేఖ రాశారురు! ఇంకోగాయన స్పందించారన్నారు. వరుస ఎపిసోడ్స్ వెనుక ఆంతర్యం ఏంటి? అన భట్టి ప్రశ్నించారు. సింగరేణి నుంచి ఏ నిర్ణయం పై మంత్రి వద్దకు ఫైల్స్ రావని, సింగరేణి స్వతంత్ర బాడీ అని, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుదన్నారు. కనీస ఇంగితజ్ఞానం లేకుండా కథనం రాశారని భట్టి పేర్కొన్నారు. దీనిపై హరీష్ రావు లేఖ రాయడం, కిషన్ రెడ్డి విచారణ మొదలు పెట్టడం మంచిదయ్యిందన్నారు. కిషన్ రెడ్డి విచారణ ను తాను స్వాగతిస్తున్నానన్నారు. కొందరి ప్రయోజనాల కోసం పని చేసే వాళ్ల అన్ని విషయాలు బయటకు రావాలని భట్టి అన్నారు.
సింగరేణి టెండర్ల లో సైట్ విజిట్ తప్పనిసరి నిబంధన 2018లో కేంద్ర ప్రభుత్వమే పెట్టిందని, 2021 లో సింగరేణి - కోల్ ఇండియా ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లెకముందే సైట్ విజిట్ తప్పనిసరి అంటూ టెండర్లు పిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాత పద్ధతి ప్రకారమే టెండర్లు పిలిచారు. ఎన్‌ఎండీసీ 2021 లో సైట్ విజిట్ తప్పనిసరి అంటూ టెండర్లు పిలిచారని భట్టి తెలిపారు.
బిడ్డర్లు సైట్ విజిట్ చేయాలని నిబంధనలు ఉన్నాయి. హిందూస్తాన్ కాపర్స్ లిమిట్ ఆధ్వర్యంలో సైట్ విజిట్ తప్పనిసరి అంటూ టెండర్లు పిలిచారు.జీఐసీపీఎల్ సైట్ విజిట్ తప్పని అంటూ టెండర్లు పిలిచారు.గుజరాత్ లో సైట్ విజిట్ చేసినట్లు సర్టిఫికెట్ సడ్మిట్ చేసినట్లు సంతకాలు ఉన్నాయి. తమిళ నాడు లో నవరత్న కంపెనీ సైట్ విజిట్ సర్టిఫికెట్ లతోనే టెండర్లు పిలిచారు. ఉత్తరాఖండ్ లో సైనిక్ స్కూల్ టెండర్లలో సైట్ విజిట్ తప్పనిసరి చేస్తూ డిఫెన్సె శాఖ లేఖలు ఉన్నాయని భట్టి పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక ఆధ్వర్యంలో జరిగిన టెండర్లలో సైట్ విజిట్ తప్పనిసరి చేసిందని, మహారాష్ట్ర లో డిపార్ట్మెంట్ ఏకనామిక్స్ లో సైట్ విజిట్ తప్పనిసరి చేస్తూ టెండర్లు పిలిచారని, దిన్ దయాళ్ పోర్ట్ లో సైట్ విజిట్ అథారిటీ టెండర్లు పిలిచారని భట్టి తెలిపారు. జమ్ముకశ్మీర్ లో అక్కడి ప్రభుత్వం సైట్ విజిట్ తప్పనిసరి చేస్తూ టెండర్లు పిలిచిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.


