మాజీ ఎమ్మెల్యే(మెట్‌పల్లి) కొమిరెడ్డి రాములు కన్నుమూత

Metpally EX MLA Komireddy Ramulu Passed Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్‌పల్లి(ప్రస్తుత కోరుట్ల నియోజకవర్గం) మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కొమిరెడ్డి రాములు 2004-2009లో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగారు.

కాగా మెట్‌పల్లి నియోజకవర్గం ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కోరుట్ల అసెంబ్లీ స్థానంలో కలిసిపోయింది. కొమిరెడ్డి మృతిపట్ల స్థానిక ఎ‍మ్మెల్యే విద్యాసాగర్ రావు సంతాపం తెలియజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top