
సాక్షి,హైదరాబాద్: బేగంబజార్ కనిష్క జ్యువెల్లరీ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినదా లేదా అనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం అందాల్సి ఉంది.