రెండు కిలోమీటర్ల మేర రాజుకున్న అగ్గి

Marripelligudem: Massive Fire Breaks out in Warangal District - Sakshi

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం 

కమలాపూర్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం మర్రిపల్లిగూడెంలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వరి కోసిన పంటపొలాల్లోని కొయ్య కాళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో ఈదులకుంట నుంచి కొత్తకుంట వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ మంటలు వ్యాపించాయి.

ఇలా సుమారు వంద ఎకరాలకు మంటలు విస్తరించగా.. పశుగ్రాసంతో పాటు 20 మంది రైతులకు చెందిన పైపులు, విద్యుత్‌ వైర్లు, మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. మరోవైపు అగ్నిమాపక వాహనాలు కూడా రాకపోవడంతో రాత్రివరకు మంటలు భారీగా ఎగిసి పడుతూనే ఉన్నాయి. గ్రామాన్ని దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.  

చదవండి:
రైతుల పొట్టగొట్టి.. జనాల జేబుకొట్టి.. దోచుకుంటున్న వైనం

మా చేతిలో ఏమీ లేదు: చేతులు ఎత్తేసిన తెలంగాణ మంత్రులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top