జాబ్స్‌.. గాయబ్‌ | Many People Lost Jobs Due To Coronavirus | Sakshi
Sakshi News home page

జాబ్స్‌.. గాయబ్‌

Sep 19 2020 4:33 AM | Updated on Sep 19 2020 4:33 AM

Many People Lost Jobs Due To Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారికి వేతన జీవులు విలవిల్లాడుతున్నారు. ఇంజనీర్లు, అకౌంటెంట్లు, ప్రైవేట్‌ టీచర్లు వంటి వివిధ రంగాల వైట్‌ కాలర్‌ వృత్తి నిపుణుల తో పాటు వివిధ కేటగిరీల్లో పారిశ్రామిక రం గంలో పనిచేసే ఇండస్ట్రియల్‌ వర్కర్స్‌నూ తీవ్రంగా ప్రభావితం చేసింది. లాక్‌డౌన్‌ను ఎ త్తేశాక కోవిడ్‌ దుష్పరిణామాల తీవ్రత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మే నుంచి ఆగస్టు వరకు.. కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ సం స్థల్లో పనిచేస్తున్న దాదాపు 60 లక్షల వృత్తి నిపుణులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుముందు రోజులను కూడా కలుపుకుంటే మొత్తం 66 లక్షల మంది ౖ‘వెట్‌ కాలర్‌’వృత్తి నిపుణుల జాబ్స్‌ పోయాయి. స్వ యం ఉపాధితో పాటు సొంతంగా కొనసాగుతున్న వృత్తి నిపుణులు ఈ జాబితాలోకి రారు. 

వైట్‌ కాలర్స్‌పై అధిక ప్రభావం... 
ఈ ఏడాది మే–ఆగస్టు మధ్యకాలంలో సెంట ర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) ‘ట్వంటీయెత్‌ వేవ్‌ ఆఫ్‌ కన్జ్యూమర్‌ పిరమిడ్స్‌ హౌస్‌ హోల్డ్స్‌ పేరుతో సర్వే చేసిం ది. ఇందులో వైట్‌ కాలర్‌ వృత్తి నిపుణులు, ఇండస్ట్రీయల్‌ వర్కర్లపై కరోనా ప్రభావం.. వారు కోల్పోయిన ఉద్యోగాల గురించి వివ రించింది. వైట్‌కాలర్‌ వృత్తి నిపుణులైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, అనాలిస్ట్‌లు తదితర రంగాలకు చెందిన వారి ఉద్యోగాలపై కరోనా తీవ్రంగా పడినట్టు స్పష్టం చేసిం ది. 2016 తర్వాత వైట్‌ కాలర్‌ ప్రొఫెషనల్స్‌ ఉద్యోగాల్లో వృద్ధి పుంజుకోగా, ఆ ఏడాది జ నవరి–ఏప్రిల్‌ మధ్య 1.25 కోట్ల మంది వివిధ రంగాల్లో కొనసాగారు. అదే 2019, మే–ఆగస్టు నాటికి 1.88 కోట్ల మంది ఉద్యోగాల్లో ఉన్నారు.

2019 సెప్టెంబర్‌–డిసెంబర్‌ నాటికి ఈ సంఖ్య 1.87 కోట్లు ఉండగా, ఈ ఏడాది జనవరి–ఏప్రిల్‌ నాటికి 1.81 కోట్లకు తగ్గిపోయింది. లాక్‌డౌన్‌ ప్రభావం కారణం గా ఈ సంఖ్య స్వల్పంగా తగ్గగా, అది ఎత్తే సిన తర్వాత మే–ఆగస్టు నాటికి వృత్తి నిపుణు ల ఉద్యోగాలు 1.22 కోట్లకు తగ్గిపోయాయి. అంటే మొత్తంగా దాదాపు 66 లక్షల ఉద్యోగాలకు కోత పడింది. గత నాలుగేళ్లలో సృష్టించిన దాదాపుగా అన్ని ఉద్యోగాలు పోయా యని సీఎంఐఈ విశ్లేషించింది. ఈ ఏడాది మే–ఆగస్టు మధ్యలో 59 లక్షల మంది, అంతకుముందు నాలుగు నెలలు (జనవరి–ఏప్రిల్‌ మధ్యలో) కూడా కలిపితే మొత్తం 66 లక్షల ఉద్యోగాలు పోయినట్లు (2019 మే–ఆగస్టుతో పోల్చితే)గా ఈ సర్వే తేల్చింది. 

వీరిపై లాక్‌డౌన్‌ ప్రభావం లేదు.. 
ఆఫీసుల్లో పనిచేసే క్లర్క్‌లు, సెక్రటరీలు, బీపీవో, కేపీవో, డేటా ఎంట్రీ ఆపరేటర్ల వంటి వారి ఉద్యోగాలపై కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం పడలేదని అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో అధిక శాతం లాక్‌డౌన్‌తో ఇంటి నుంచి పనిచేసే విధానానికి మళ్లినట్లు తెలుస్తోంది. 

50 లక్షల మంది ఉద్యోగాలపై దెబ్బ..
లాక్‌డౌన్‌ ఎత్తేశాక 50 లక్షల మంది ఇండస్ట్రీయల్‌ వర్కర్లు ఉద్యోగాలు కోల్పోయారు. చి న్న తరహా పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ యూ నిట్లలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరిం త తగ్గి ఉంటాయని ఈ సర్వే విశ్లేషించింది. ఇటీవలి కాలంలో మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడి యం ఇండస్ట్రియల్‌ యూనిట్స్‌లోనూ ఉద్యో గాలు తగ్గినట్టుగా సీఎంఐఈ పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement