khammam: మిర్చితోటలో వ్యక్తి మృతదేహం లభ్యం | Man's Body Found In Pepper Garden In Khammam, Hands Tied With Plastic Rope And Injuries On Head | Sakshi
Sakshi News home page

Khammam: మిర్చితోటలో వ్యక్తి మృతదేహం లభ్యం

Jan 25 2025 10:59 AM | Updated on Jan 25 2025 11:58 AM

Man's body found in pepper garden

కూసుమంచి: ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, లింగారంతండా సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మిర్చి తోటలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించగా.. హైదరాబాద్‌కు చెందిన సదరు వ్యక్తిని తీసుకొచ్చి హత్య చేసినట్లు తేలింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం మిర్చి తోటలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై నాగరాజు మృతుడి రెండు చేతులు ప్లాస్టిక్‌ తాడుతో కట్టేసి ఉండటం, తలపై గాయాలు కనిపించడమే కాక మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో మృతుడు హైదరాబాద్‌కు చెందిన బొల్ల రమేష్(52)గా తేలింది. ఆయన రెండు రాష్ట్రాల్లో పాన్‌ మసాలా సరఫరా చేసేవాడు. ఈనెల 18న బయటికి వెళ్లిన అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అక్కడి ఖార్ఖానా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేస్తుండగానే ఓ వ్యక్తి రమేష్ ను హత్య చేసినట్లు చెబుతూ లొంగిపోయాడు.

నలుగురు వ్యక్తులు 18న రాత్రి అతడిని కారులో ఖమ్మం వైపు  తీసుకొచ్చి హత్య చేసిన అనంతరం ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారి పక్కన మిరపతోటలో మృతదేహాన్ని పడవేసినట్లు చెప్పాడు. దీంతో అక్కడి పోలీసులు వచ్చి గాలించినా సరైన ప్రాంతం తెలియక వెనుతిరిగారు. ఇంతలోనే కూసుమంచి పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రమేష్‌ కుటుంబీకులతో శుక్రవారం రాత్రి వచ్చి మృతదేహం ఆయనదేనని నిర్ధారించుకున్నారు. డబ్బు కోసమే రమేష్  ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించి అన్నం ఫౌండేషన్‌ సభ్యుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement