Telangana Student Manikanth Reddy Died Of Heart Attack In Philippines - Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్యార్థి మణికాంత్‌రెడ్డి మృతి.. పోస్టుమార్టం రిపోర్టు ఇదే..

Apr 28 2023 9:05 AM | Updated on Apr 28 2023 10:08 AM

Manikanth Reddy Died Of Heart Attack In Philippines - Sakshi

భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం రాంలింగంపల్లి గ్రామానికి చెందిన వైద్య విద్యార్థి గూడూరు మణికాంత్‌రెడ్డి (21) మృతికి కార్డియాక్‌ అరెస్టే (గుండె ఆగిపోవడం) కారణమని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మణి కాంత్‌రెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి ఫిలి ప్పీన్స్‌కి వెళ్లి అక్కడ ఈ నెల 23న ఉదయం అను మానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. 

కాగా.. మణికాంత్‌ మృతదేహానికి అక్కడి వైద్యులు బుధవారం పోస్టుమార్టం నిర్వహించగా కార్డియాక్‌ అరెస్ట్‌తోనే మృతిచెందినట్టు తేలిందని, ఈ మేరకు అక్కడి అధికారుల నుంచి సమాచారం వచి్చందని మృతుడి బంధువులు తెలిపారు. మణికాంత్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు అ«ధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతదేహం హైదరాబాద్‌కు రానుందని తెలిసింది. 

ఇది కూడా చదవండి: ప్రేమ విఫలమైందని సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్న జవాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement