చెల్లిని మోసుకుంటూ వాగు దాటిన అన్న 

Mancherial District Rural Areas People Suffering Monsoon Season - Sakshi

ఆసుపత్రికి తీసుకెళ్లడం కోసం యాతన

చెన్నూర్‌ రూరల్‌: సరైన దారిలేక.. వర్షాకాలం లో వాగులు దాటలేక గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యతో ఒక్కోసారి ప్రాణాలూ కోల్పోతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం నారాయణపూర్‌కు చెందిన నిట్టూరి ప్రవళికకు శనివారం ఫిట్స్‌ వచ్చాయి. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇంటి నుంచి స్కూటీపై తీసుకొచ్చినా.. గ్రామ సమీపంలోని సుబ్బరాంపల్లి వాగుపై వంతెన లేక దాటడం కష్టంగా మారింది. అప్పటికే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. వాగు అవతలి ఒడ్డు వరకు వచ్చింది. ప్రవళికను ఆమె అన్న ప్రభాకర్‌ మోసుకుంటూ వాగు దాటి అంబులెన్స్‌ ఎక్కించాడు. చెన్నూర్‌ ప్రభుత్వ ఆసు పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top