చలాన్ల వేధింపులు తట్టుకోలేక బైక్‌కు నిప్పంటించాడు

Man Set His Bike On Fire Due To Unbearable Traffic Challans In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ట్రాఫిక్‌ పోలీసులు చలాన్ల పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝులిపిస్తున్న పోలీసులు అన్ని నిబంధనలు పాటించిన వారిపై కూడా ఇష్టం వచ్చినట్లు చలాన్లు విధిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసుల అత్యుత్సాహానికి సంబంధించిన ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: బూజుపట్టిన బాదం మిల్క్‌.. హెరిటేజ్‌ స్టోర్‌ మూసివేత

తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ పోలీసుల చలాన్ల బాధలు భరించలేక ఓ వ్యక్తి తన మోటార్ సైకిల్‌కు నిప్పు పెట్టాడు. పంజాబ్ చౌరస్తాలో ట్రాపిక్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఖానాపూర్‌కు చెందిన మక్బూల్ అనే వ్యక్తి తన బైక్‌కు నిప్పు పెట్టడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చలాన్లు కట్టిన కూడా తరుచూ కట్టాలని ట్రాఫిక్‌ పోలీసులు అడుగుతున్నారని, చలానాల బాధలు తట్టుకోలేకే తన బైక్‌కు నిప్పు పెట్టినట్లు మక్బూల్ అవేదన వ్యక్తం చేశారు.

చదవండి: 2000 మందికి సున్నా మార్కులు.. నోరెళ్లబెట్టిన విద్యార్థులు, కారణమేంటి?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top