బిర్యాని కోసం వెళ్లి మృత్యువాత | Man dies as floods hit | Sakshi
Sakshi News home page

బిర్యాని కోసం వెళ్లి మృత్యువాత

Sep 3 2024 12:20 PM | Updated on Sep 3 2024 12:20 PM

Man dies as floods hit

కోదాడ: బిర్యాని తెచ్చుకుందామని కారులో బయలుదేరిన నాగం రవికుమార్‌ అలియాస్‌ మురళీకృష్ణ (45) కారుతో సహా వాగులో కొట్టుకుపోయి మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. నాగం రవికుమార్‌ కోదాడ పట్టణ పరిధిలోని 34వ వార్డు మాతానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు. కోదాడకు చెందిన నాగం రోజాను వివాహం చేసుకుని కోదాడలోనే స్థిరపడ్డాడు. గతంలో కోదాడలో వైన్స్‌ షాపు నడిపేవాడు. 

ఇతడి భార్య.. పిల్లల చదువు కోసం హైదరాబాద్‌లో ఉంటుండగా రవికుమార్‌ ఒక్కడే కోదాడలో ఉంటున్నాడు. శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో బిర్యాని తెచ్చుకుంటానని స్నేహితులతో చెప్పి కారులో బయలుదేరాడు. మాతానగర్‌ నుంచి టీచర్స్‌ కాలనీ మీదుగా బైపాస్‌ సమీపంలో ఉన్న దాబాకు ఒక్కడే బయలుదేరినట్లు అతడి మిత్రులు చెబుతున్నారు. 

ఉలక వాగు ఉధృతిని గమనించకపోవడంతోపాటు వంతెన తక్కు ఎత్తులో ఉండడంతో మధ్యలోకి వెళ్లిన తరువాత భయానికి కారు ఆపాడు. అంతలోనే వరద పెరగడంతో కారుతో సహా కొట్టుకుపోయాడని, అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో గమనించలేదని స్నేహితులు చెబుతున్నారు. ఉదయం వాగులో కారు కనపడడంతో కోదాడ మాజీ సర్పంచ్‌ ఏర్నేనిబాబు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. అందులో రవికుమార్‌ మృతి చెంది ఉన్నాడు. రవికుమార్‌కు భార్య రోజా, ఇద్దరు కుమారులు నాగం సాయితేజ, వెంకటేష్‌ ఉన్నారు. రవికుమార్‌ మృతదేహాన్ని సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి సందర్శించి నివాళులరి్పంచారు. 

Advertisement
 
Advertisement
Advertisement