గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి | man died in ganesh immersion | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి

Sep 16 2024 8:33 AM | Updated on Sep 16 2024 8:33 AM

man died in ganesh immersion

విగ్రహం మీద పడటంతో నీటమునిగి యువకుడి మృతి 

మేడ్చల్‌ రూరల్‌: మేడ్చల్‌ మండలం రాజబొల్లారం తండాలో శనివారం రాత్రి నిర్వహించిన వినాయక నిమజ్జనం అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీటమునిగి మృతి చెందాడు. స్ధానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజ బొల్లారం తండాకు చెందిన మాజీ సర్పంచ్‌ మాంగ్యా నాయక్‌ తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి పలువురు యువకులు సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లారు. 

విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో కరంతోడ్‌ సురేందర్‌ అలియాస్‌ హంజా(28) నీటిలో మునిగాడు. ఈ విషయాన్ని గమనించని మిగతా యువకులు విగ్రహాన్ని నీటిలోకి నెట్టారు. ఈ క్రమంలో విగ్రహం మీద పడి హంజా నీటిలో మునిగిపోయాడు. నిమజ్జనం తర్వాత రోడ్డుపైకి వచ్చిన యువకులకు హంజా కనబడకపోవడంతో తిరిగి నీటిలోకి వెళ్లి చూడగా విగ్రహం కింద పడి విగతజీవిగా కనిపించాడు. మృతుడు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మేడ్చల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement