కరోనా విషాదం: టెస్టు ఫలితం రాకముందే..

Man Deceased Fear Of Corona In Nizamabad District - Sakshi

కరోనా భయంతో కళ్లముందే చెట్టంత కొడుకు కూర్చున్న చోటనే విగతజీవిగా మారడంతో కన్నపేగు కన్నీటి రోదన హృదయాలను ద్రవీంపచేస్తోంది. ‘ఇంటికి పోదాం లేవయ్యా..’ అంటూ ప్రాణాలు కోల్పోయిన భర్తను పట్టుకుని భార్య విలపించిన హృదయ విదారక దృశ్యం గుండెలను పిండెస్తోంది. ఈ విషాద ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. 

బోధన్‌ టౌన్‌/రెంజల్‌: కరోనా సోకకున్నా పలువురు అనవసరంగా ఆందోళన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా తనకు కరోనా వచ్చిందేమోనన్న భయంతో అనవసర ఆందోళన పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. రెంజల్‌ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్‌ (30) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్‌. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నాడు.

కరోనా లక్షణాలుగా భావించి తన భార్య లక్ష్మి, తల్లి గంగామణి, తమ్ము డు గంగాధర్‌తో కలసి ఆదివారం రెంజల్‌ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. టెస్టు చేయించుకున్న అశోక్‌ నీరసంగా ఉందని పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లి తల్లి, భార్యతో కలసి కూర్చున్నాడు. తరచూ కోవిడ్‌వార్తలు వింటున్న ఆయన పరీక్ష ఫలితం రాకముందే తనకున్న లక్షణాలను బట్టి కోవిడ్‌ వచ్చిందేమోనని తీవ్ర భయాందోళనకు లోనయ్యాడు. దీంతో ఆయన అక్కడిక్కడే చెట్టుకిందే కుప్ప కూలిపోయాడు. 

కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లి, భార్య
బాధితుడి భార్య ఆస్పత్రి ప్రాంగణంలో ‘ఇంటికి పోదాం లేవయ్యా’ అంటూ విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసింది. కుమారుడిని పట్టుకుని అశోక్‌ తల్లి గంగామణి కన్నీటిపర్యంతమయింది. ఇదిలాఉంటే అనంతరం వచ్చిన కరోనా పరీక్ష ఫలితాల్లో అశోక్‌ కరోనా నెగెటివ్‌ అని తేలింది.  

చదవండి: 
పరీక్ష కోసమని వచ్చి.. కుర్చీలో కూర్చుని అలాగే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top