ఉద్యోగం పోయిందని ఆత్మహత్య | Man Commits Suicide In Nizamabad | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పోయిందని ఆత్మహత్య

Mar 12 2023 9:02 PM | Updated on Mar 12 2023 9:10 PM

 Man Commits Suicide In Nizamabad - Sakshi

3 నెలల క్రితం ఉద్యోగం పోయింది.

నిజామాబాద్: ఉద్యోగం పోవడంతో చేసిన అప్పు లు తీర్చలేక మనోవేదనకు గురై ఒకరు ఉరి వేసుకు ని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గాంధారికి చెందిన వడ్ల శ్రీకాంత్‌ (35) ఓ కంపెనీలో మెడికల్‌ రిప్రెజెంటివ్‌గా పనిచేస్తూ దేవునిపల్లిల్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 శ్రీకాంత్‌ ఇటీవల ఓ బ్యాంక్‌లో వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. బయట కూడా కొన్ని అప్పులు చేసినట్లు తెలిసింది. 3 నెలల క్రితం ఉద్యోగం పోయింది. దీంతో అప్పులు చెల్లించలేక ఇబ్బందులు తప్పలేదు. అప్పుల విషయంలో పలుసార్లు భార్యా, భర్తల మధ్య గొడవలు జరిగాయి. హోళీ పండగ రోజున అతని భార్య, పిలల్లతో కలిసి అత్తగారింటికి లింగంపేట మండలం దేమె గ్రామానికి వెళ్లాడు.

 మరుసటి రోజు ఒక్కడే దేవునిపల్లికి వచ్చాడు. శనివారం ఉదయం అతని భార్య మౌనిక ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా శ్రీకాంత్‌ ఎత్తకపోవడంతో దేమె నుంచి దేవునిపల్లి ఇంటికి వచ్చి చూసింది. అప్పటికే శ్రీకాంత్‌ హాల్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement