
సాక్షి, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల అన్నారంలో గ్రామంలో గుబ్బ కోల్డ్ స్టోరేజ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోల్డ్ స్టోరేజ్‌కు సంబంధించిన పరిశ్రమలో మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాల వరకు విస్తరించాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు వెల్లడి కాలేదు

