విచిత్ర సంఘటన.. డ్రైవర్‌గా మారిన పెళ్లికొడుకు   

Mahabubnagar: Groom Become A Driver For His Wedding Due To Lockdown - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: కరోనా సమయంలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లికుమార్తె ఇంటికి వెళ్లేందుకు డ్రైవర్లు రాకపోవడంతో పెళ్లికుమారుడే డ్రైవర్‌గా మారాడు. నారాయణపేట జిల్లా మాగనూర్‌ మండలంలోని ఓబ్లాపూర్‌కు చెందిన మూర్తికి కృష్ణా మండలం హిందుపూర్‌కు చెందిన యువతితో వరుడి స్వగ్రామంలో శుక్రవారం వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత తమ కుటుంబసభ్యులతో పెళ్లి కూతురు స్వగ్రామానికి వెళ్లడానికి లాక్‌డౌన్‌ ఉండడంతో డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదు.  దీంతో పెళ్లి కుమారుడు  తన సొంత వాహనంలో పెళ్లి కుమార్తెను  పక్కన కూర్చొబెట్టుకుని, మిగతా కుటుంబ సభ్యులను వాహనం వెనక ఎక్కించుకుని, పెళ్లికుమార్తె గ్రామానికి వెళ్లాడు. పెళ్లికుమారుడే వాహనం నడుపుకుంటూ రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యంగా చూశారు.  

చదవండి: మేడమ్‌.. అలా వచ్చారు.. ఇలా మార్చారు..!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top