మహబూబాబాద్: టమాటా కూర మహిళ ప్రాణం మీదకు తెచ్చింది

Mahabubabad Crime: Mother In Law Daughter In Law Fight - Sakshi

సాక్షి, మహబూబాబాద్:  కోడలు వండిన టమాట కూర.. ఆ అత్త ప్రాణం మీదకు తెచ్చింది. భార్యను అవమానించిందంటూ సొంత తల్లిపైనే ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ మండలంలో జరిగింది. 

వేంనూరులో ఆత్తకోడళ్ళ మధ్య  ఘర్షణ.. ఒక ప్రాణం మీదకు తెచ్చింది. వండిన టమాటా కూర బాగలేదని  కోడలిని మందలించింది అత్త బుజ్జి. ఈ విషయంపై భర్తకు ఫిర్యాదు చేసింది నందిని. తన భార్యనే అట్లా అంటావా అంటూ మటన్‌ కొట్టే కత్తితో కొడుకు మహేందర్‌ సొంత తల్లిపైనే దాడికి దిగాడు. 

ఈ దాడిలో తల్లి బుజ్జి తల్లి తలకు తీవ్రగాయ్యాలు. వెంటనే ఆమెను స్థానికులు మహబూబాబాద్ ఏరియా హస్పటల్ కి తరలించారు. ఆపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top