Maha Shivaratri 2022: Telangana Keesaragutta Temple Jatara Date, Other Details Here - Sakshi
Sakshi News home page

Maha Shivaratri 2022: కీసరగుట్ట జాతరకు రూ.50 లక్షలు

Feb 23 2022 12:23 PM | Updated on Feb 23 2022 12:40 PM

Maha Shivaratri 2022: Keesaragutta Temple Jatara Date, Other Details Here - Sakshi

మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్‌ జిల్లా కీసర గుట్టలో జాతర ఈ నెల 27 నుంచి మార్చి 4 వరకు జరుగుతుందన్నారు మంత్రి మల్లారెడ్డి.

Maha Shivratri in Telangana, 2022: మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్‌ జిల్లా కీసర గుట్టలో రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లు, వసతుల కల్పనలో అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్, జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్‌ శ్యాంసన్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, పోలీసులు, కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ నెల 27 నుంచి మార్చి 4 వరకు కీసరగుట్ట జాతర జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.50 లక్షలు ప్రత్యేక నిధులు విడుదల చేసిందని తెలిపారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని మంత్రి సూచించారు. 

కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ ఛైర్మన్‌ వెంకటేశం, పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి, ఘట్కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ ఉమాపతి శర్మ, ధర్మకర్తల మండలి సభ్యుడు నారాయణ శర్మ, డీఆర్‌ఓ లింగ్యానాయక్, ఆర్డీఓలు రవికుమార్, మల్లయ్య, ఆలయ ఈఓ కట్ట సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. (క్లిక్: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో శాసనాల ప్రదర్శనశాల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement