బంగాళాఖాతంలో అల్పపీడనం | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో అల్పపీడనం

Published Sun, Oct 11 2020 2:40 AM

 Low Pressure In The Bay Of Bengal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉం దని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి అక్టోబర్‌ 12న మధ్యాహ్నం తర్వాత ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది.

అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కరీం నగర్, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలి పింది. ఈ నెల14న మరో అల్పపీడనం ఏర్పడే అవ కాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. 

Advertisement
Advertisement