ఔదార్యం చాటిన సిర్సనగండ్ల సర్పంచ్‌

Lockdown: Sirsanagandla Village Sarpanch Distributing Vegetables To Poor People - Sakshi

లాక్‌డౌన్‌ వేళ 1,200 కుటుంబాలకు కూరగాయల పంపిణీ 

కొండపాక (గజ్వేల్‌): లాక్‌డౌన్‌ వేళ తమ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడొద్దని స్వంత డబ్బులతో కూరగాయలు పంపిణీ చేసి ఓ సర్పంచ్‌ తన ఔదార్యం చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సిర్సనగండ్ల గ్రామంలో సర్పంచ్‌ గూడెపు లక్ష్మారెడ్డి బుధవారం 1,200 కుటుంబాలకు ఐదు రోజులకు సరిపడా కూరగాయలను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ పూర్తయ్యేంత వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కోరాడు. అనంతరం రంజాన్‌ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మంజూరు అయిన దుస్తుల కిట్లను లబ్ధిదారులకు అందజేశాడు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్లు సాయపడ్డారు.

కోవిడ్‌ హెల్ప్‌ యాప్‌ ఆవిష్కరణ 
నర్సాపూర్‌: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని బీవీ రాజు ఇంజనీరింగ్‌ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం విద్యార్థులు కోవిడ్‌ హెల్ప్‌ యాప్‌ను రూపొందించారు. ఆ యాప్‌ను బుధవారం కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీప్రసాద్‌ ఆవిష్కరించారు. ఈ యాప్‌లో కోవిడ్‌ సమాచారం లభించడంతో పాటు వైరస్‌ బాధితులకు యాప్‌ ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. యాప్‌లో ఆస్పత్రుల పడకలు, ప్లాస్మా దాతల వివరాలు పొందవచ్చని చెప్పారు. యాప్‌ను తయారు చేసిన విద్యార్థులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు
చదవండి: పీఎం కేర్‌ నిధులతో  1.5 లక్షల ఆక్సీమీటర్లు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top