Photo Feature: ఇలా కూడా టీకాలు వేస్తారు! | Sakshi
Sakshi News home page

Photo Feature: ఇలా కూడా టీకాలు వేస్తారు!

Published Wed, Jun 30 2021 6:50 PM

Local to Global Photo Feature in Telugu: Siddipet, Rare Bird, Covid Vaccination - Sakshi

భారీ వర్షంతో భాగ్యనరం తడిసిముద్దయింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షంతో భాగ్యనగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. టీకాలు వేయించుకునేందుకు ప్రజలు వ్యాక్సినేషన్‌ కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు. బెంగాల్‌లో పడవలో వెళ్లి మరీ టీకాలు వేస్తున్నారు. మరిన్ని ‘చిత్ర’ వార్తల కోసం ఇక్కడ చూడండి. 

1/9

కరీంనగర్‌: మానేరు నది మీద నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి సామర్థ్య పరీక్షల్లో భాగంగా వంతెనపై నాలుగు లేన్లలో ఇసుకతో నింపిన 28 టిప్పర్లను నిలిపిన దృశ్యం

2/9

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌ నగరంలో మంగళవారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. అత్యధికంగా సీతాఫల్‌మండిలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

3/9

రోజురోజుకు వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు ప్రజల కష్టాలు తప్పడం లేదు... మొదట్లో కాస్త వెనుకంజ వేసినా కరోనా తీవ్రతకు టీకా తప్పనిసరి కావడంతో టీకా కోసం ఎగబడుతున్నారు ప్రజలు.. పెద్దపల్లిలో అమర్‌చంద్‌ హాల్‌లో మున్సిపల్‌ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో పెద్ద ఎత్తున బారులు తీరారు స్థానికులు... – సాక్షి ఫోటోగ్రాఫర్, పెద్దపల్లి.

4/9

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం సమీపంలో నిర్మించిన పార్వతీ బ్యారేజీ డెలివరీ సిస్టర్న్‌కు ఉన్న పైపులైన్‌లో నాల్గో మోటార్‌ పైపు వద్ద భూమి కుంగిపోయింది.

5/9

చెట్లు, పొలాల మధ్య ప్రకృతి ఒడిలో పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు. ఈ చిన్నారులు ఓ పొలంలో చెట్టుపై మంచె కట్టుకుని సందడి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకోకపోవడంతో ఇలా ఆటవిడుపు వెతుక్కుంటున్నారు. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట

6/9

సిద్దిపేట శివారులోని నర్సాపూర్‌ డబుల్‌ బెడ్‌రూం కాలనీలో ఓ బొమ్మ అటుగా వెళ్లే వారిని ఆకర్షిస్తోంది. ఇళ్ల మధ్య ఉన్న గుట్టలపై వేసిన అందమైన పెయింటింగ్‌ చూసిన వారిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట

7/9

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపుల సంగారెడ్డి మున్సిపల్ అధికారులు అందమైన మొక్కల కుండీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ గ్రామీణ వాతావరణం అగుపించేలా జాజు రంగులో ఉన్న కుండీలు పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నాయి. కోణాకార్పస్, మేరీ మిర్చి గ్రీన్, టెంపుల్ ట్రీ, పాక్ టైల్ , సృజన వంటి ఐదు రకాల మొక్కలను పెట్టారు. - బి. శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి

8/9

జిల్లా కేంద్రం నిర్మల్‌ ఆర్‌అండ్‌బీ వసతి గృహం ఆవరణలోని చెట్టుపై ఓ అరుదైన పక్షి మంగళవారం దర్శనమిచ్చింది. బూడిద రంగు కలిగి పొడవైన ముక్కు, తోకతో స్వైన్సన్‌ టక్కన్‌ జాతికి చెందిన ఈ పక్షి ఎక్కువగా అమెరికాలో కనిపిస్తుంది. మనదేశంలో అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా కనిపిస్తుందని అటవీ శాఖ అధికారి పేర్కొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్‌

9/9

పశ్చిమ బెంగాల్‌ హౌరాలోని మండేశ్వరీ, రూప్‌నారాయణ్‌ నదుల మధ్యలో ఉన్న వటోరా ద్వీపానికి మంగళవారం పడవపై చేరుకొని స్థానికులకు కరోనా టీకాలు వేస్తున్న వైద్య సిబ్బంది

Advertisement

తప్పక చదవండి

Advertisement