
గుండి గ్రామం జిల్లా కేంద్రమైన కుమ్రంభీం ఆసిఫాబాద్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రజలు వైద్యం, విద్య, ఇతర అవసరాలకు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఇక్కడి గుండివాగు దాటాల్సిందే. వానాకాలం వచ్చిందంటే పీకల్లోతు తిప్పలే.. థర్మాకోల్‌తో చేసిన తెప్పపై మనుషుల్ని కూర్చోబెట్టి ఇద్దరు వ్యక్తులు ఈ వాగు దాటిస్తుంటారు. మనిషికి రూ.40 నుంచి రూ.50 చొప్పున తీసుకుంటారు. 2006లో ఈ వాగుపై రూ.3.60 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం మొదలై ఆగిపోయింది. 2016లో రీటెండరింగ్‌తో రూ.8.40 కోట్లతో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పిల్లర్ల దశలో ఉన్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్/ఆసిఫాబాద్‌రూరల్