
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టును మాజీ సీఎం కేసీఆర్ ఆశ్రయించారు. తనపై నమోదైందని, ఆ కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్ రోకో కేసులో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, 15వ నిందితుడుగా చేర్చారని అన్నారు.
అసలు తాను రైల్ రోకోలో పాల్గొనలేదని, కేసు కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పిటిషన్‌పై మంగళవారం (జూన్25న)తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది.