ఖాళీగా కళ్లద్దాల పెట్టెలు.. అవాక్కయిన కంటి రోగులు | Kanti Velugu: Empty Eye Glass Boxes Found In Kamareddy | Sakshi
Sakshi News home page

ఖాళీగా కళ్లద్దాల పెట్టెలు.. అవాక్కయిన కంటి రోగులు

Feb 22 2023 4:54 AM | Updated on Feb 22 2023 8:14 AM

Kanti Velugu: Empty Eye Glass Boxes Found In Kamareddy - Sakshi

కామారెడ్డి టౌన్‌: కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్ష చేయించుకున్నారు. కళ్లద్దాల పెట్టె అందిస్తే ఆనందంగా అందుకున్నారు.. తీరా దాన్ని తెరిచి చూస్తే ఖాళీగా కనిపించడంతో అవాక్కవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్‌ మండలం అంచనూర్‌ గ్రామానికి చెందిన దూడ బీరయ్య కంటి వెలుగు కార్యక్రమంలో తనిఖీ చేయించుకున్నారు.

ఈ సందర్భంగా మంగళవారం ఆయనకు వైద్య సిబ్బంది కళ్లద్దాల పెట్టె అందజేశారు. కానీ పెట్టె తెరిచాక అందులో కళ్లద్దాలు లేకపోవడంతో బీరయ్య, అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది విస్తుపోయారు. మళ్లీ వివరాలను నమోదు చేసుకుని ఆర్డర్‌ చేస్తామని తెలిపారు. చాలాచోట్ల ఇలాగే జరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement