స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉద్రిక్తత | Kadiam Dishtibomma burning at Medikonda cross road | Sakshi
Sakshi News home page

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉద్రిక్తత

Aug 20 2023 6:22 AM | Updated on Aug 20 2023 6:23 AM

Kadiam Dishtibomma burning at Medikonda cross road - Sakshi

మీదికొండ క్రాస్‌రోడ్డు వద్ద కడియం దిష్టిబొమ్మ దహనం చేస్తున్న ఎమ్మెల్యే రాజయ్య వర్గీయులు

స్టేషన్‌ఘన్‌పూర్‌: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికే వస్తుందని విస్తృతంగా ప్రచారం కావడం, ఎమ్మెల్యే రాజయ్యపై కడియం వ్యాఖ్యలు చేయడంపై రాజయ్య అనుచరులు భగ్గుమన్నారు. శనివారం ఇక్కడ కడియం దిష్టిబోమ్మను ఎమ్మెల్యే అనుచరులు దహనం చేయనున్నారని పోలీసులు తెలుసుకొని అప్రమత్తమయ్యారు.

జెడ్పీటీసీ మారపాక రవితోపాటు పలువురిని ఉదయం అరెస్టు చేశారు. ఘన్‌పూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎమ్మెల్యే అనుచరులను, ప్రజాప్రతినిధులను ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ రాఘవేందర్, ఎస్‌ఐలు నాగరాజు, హరికృష్ణ ఆ«ధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే తమ్ముడు, ఘన్‌పూర్‌ సర్పంచ్‌ తాటికొండ సురేశ్‌కుమార్‌ గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి బయటికి వెళ్లకుండా హౌస్‌అరెస్టు చేశారు.

ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిందని, గోకుడు, గీకుడుగాళ్లు, భూకబ్జాదారులంటూ కడియం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని మీదికొండ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే అనుచరులు ఆయన దిష్టిబోమ్మను దహనం చేశా రు. శ్రీహరి డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement