‘రేవంత్‌ పార్టీని వీడాలనుకుంటున్నారు’ | KA Paul Shocking Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌ పార్టీని వీడాలనుకుంటున్నారు’

Jun 11 2025 12:02 PM | Updated on Jun 11 2025 12:03 PM

KA Paul Shocking Comments On CM Revanth Reddy

త్వరలో మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వం ఏర్పాటుచేసే యోచన

 ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌  

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘నా స్కూల్‌ బీజేపీ, నా కాలేజీ టీడీపీ, నా ఉద్యోగం రాహుల్‌ దగ్గర’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్టానం గుర్రుగా ఉందని, సీఎం పదవి నుంచి ఆయనను తప్పించాలనుకుంటోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు.

 ఒకవేళ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటే 25–30 మంది ఎమ్మెల్యేలతో రేవంత్‌ కాంగ్రెస్‌ను వీడేందుకు సన్నాహాలు చేస్తున్నారని, మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుంటున్నారని, త్వరలో ఇది జరగబోతుందని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో పాల్‌ విలేకరులతో మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement