సీరియస్ ఎన్నికలో నవ్వుల ‘పాల్’

KA Paul Funny Reaction On Munugode Result  - Sakshi

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఆనంద్‌ కిలారి పాల్‌ (కేఏ పాల్‌) ప్రచారంలో ఓటర్లను భలే అలరించారు. రోజుకో రీతిలో తనదైన శైలిలో ప్రచారం చేశారు. పాల్‌ ప్రచారానికి ఓటర్లు మునుగోడు ఓటర్లు సైతం బాగా ఆకర్షితులయ్యారు.


ఆయన కనిపిస్తే చాలు జనంలో జోష్‌ వచ్చింది. కానీ, ఓట్లలో మాత్రం పాల్‌ను ఆదరించలేదు. ఆయనకు కేవలం 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ రౌండ్‌లోనూ కనీసం రెండంకెలు కూడా దాటలేదు. కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద సైతం పాల్‌ సందడి చేశారు. (క్లిక్ చేయండి: మునుగోడు బరిలో కేఏ పాల్‌.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..)

ప్రజాస్వామ్యం ఖూనీ అయింది:  కేఏ పాల్‌ 
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక సాక్షి­గా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ప్రజా­శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఆయన మాట్లాడుతూ... ఈవీఎంల పనితీరుపై నమ్మకం లేదన్నారు. ఉప ఎన్నికలో తన ఉంగరం గుర్తుకు 1.10లక్షల ఓట్లు పడినట్లు ప్రజలు చెప్పారని, సగం కౌంటింగ్‌ పూర్తయ్యాక తనకు 600 ఓట్లు కూడా రాలేదని వాపోయారు. ఇదంతా టీఆర్‌ఎస్, బీజేపీల కుట్ర అని ఆరోపించారు. ఫలితాలు చూస్తుంటే టీఆర్‌ఎస్‌ కుట్ర ఎంటో అర్థమవుతోందని,  అధికారులంతా టీఆర్‌ఎస్‌కు అను­కూ­లంగా వ్యవహరిస్తున్నారని పాల్‌ ఆరోపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top