కేఏ పాల్‌ పిటిషన్‌.. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ‘సుప్రీం’ నోటీసులు | Supreme Court Hears Ka Paul Petition On Betting Apps | Sakshi
Sakshi News home page

కేఏ పాల్‌ పిటిషన్‌.. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు ‘సుప్రీం’ నోటీసులు

Aug 1 2025 1:57 PM | Updated on Aug 1 2025 2:44 PM

Supreme Court Hears Ka Paul Petition On Betting Apps

ఢిల్లీ: బెట్టింగ్‌ యాప్‌లను నిషేధించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 18కి వాయిదా వేసింది. అయితే, గత విచారణలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

కేంద్రం వైఖరి తెలుసుకునేందుకు మరొక అవకాశం ఇస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై కేంద్రం సమర్థిస్తుందా?. వ్యతిరేకిస్తుందా? ఎలాంటి యంత్రాంగాన్నీ ఏర్పాటు చేస్తుందో చూద్దామంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణలో మధ్యంతర ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సినిమా హీరోలు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లను ఎండార్స్ చేయకుండా నిషేధం విధించేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేఏ పాల్‌ కోరారు. బెట్టింగ్ యాప్‌లు కారణంగా కోట్లాదిమంది యువకులు నష్టపోతున్నారని సుప్రీంకోర్టు దృష్టికి కేఏ పాల్‌ తీసుకువచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement