డిగ్రీ, పీజీ పరీక్షలపై ప్రభుత్వానికే స్పష్టత లేదు | Sakshi
Sakshi News home page

డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వానికే స్పష్టత లేదు

Published Mon, Sep 14 2020 7:22 PM

Inquiry In High Court On UG And PG Final Semester Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ ముగిసింది. చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఎన్ఎస్‌యూఐ, ఇతర పిటిషనర్లు కోరారు. అయితే ఆన్‌లైన్‌లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలు కాదన్న ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సమస్య తలెత్తుతుందని కోర్టుకు తెలిపింది. పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చు. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనప్పటికీ రెగ్యులర్‌గా పరిగణిస్తాం. 

అటానమస్ కాలేజీలకు మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు స్వేచ్ఛ ఇచ్చామన్న ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్న ఓయూ కోర్టుకు వివరించింది. మిడ్‌టర్మ్ పరీక్షలు ఆన్‌లైన్‌లో.. సెమిస్టర్ ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని జేఎన్‌టీయూహెచ్ పేర్కొంది. ప్రభుత్వ విధానం గందరగోళంగా కనిపిస్తోందని.. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ ఏదో ఒకే విధానం ఉండాలని హైకోర్టు అభిప్రాయ పడింది. ఈ మేరకు హైకోర్టు స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది. (చిన్నజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement