సింగరేణి కారుణ్య నియామకాల వయో పరిమితి పెంపు | Increase in age limit for Singareni Karunya appointments | Sakshi
Sakshi News home page

సింగరేణి కారుణ్య నియామకాల వయో పరిమితి పెంపు

Jun 12 2024 5:02 AM | Updated on Jun 12 2024 5:02 AM

Increase in age limit for Singareni Karunya appointments

ఉత్తర్వులు జారీచేసిన సింగరేణి సీఎండీ బలరామ్‌ 

గోదావరిఖని: సింగరేణిలోని డిపెండెంట్ల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. కారుణ్య నియామకాల్లో వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ మంగళవారం సింగరేణి యాజమా­న్యం ఉత్తర్వులు జారీచేసింది. దీనిద్వారా సుమారు 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, అభ్య­ర్థుల గరిష్ట వయోపరిమితి ఇప్పటివరకు 35ఏళ్లే. కరోనా, విజిలెన్స్‌ విచారణ, మెడికల్‌ బోర్డులో పొరపాట్లు తదితర కారణాలతో చాలామంది వారసుల వయసు 35ఏళ్లకు మించిపోయింది. 

ఇలాంటివారు నిరుద్యోగులుగా కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు అయితే, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఇటీవల ఇచ్చిన హామీ మే రకు కారుణ్య నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ సమయంలో రెండేళ్లపాటు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది.

సింగరేణిలో పనిచేస్తూ మృతి చెందితే వారసుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే కారుణ్య నియామక ప్రక్రియ ప్ర స్తుతం కొనసాగుతోంది. అనారోగ్యంతో ఉద్యోగానికి అనర్హుడని మెడికల్‌ బోర్డు నిర్ధారించినా వారసుడికి ఉద్యోగావకాశం క ల్పిస్తోంది. వయో పరిమితి పెంపుపై ఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్‌ జనక్‌ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య హర్షం వ్యక్తం చేశారు.  

సెటిల్‌మెంట్‌ లేనివారికే..  
కారుణ్య నియామకాల్లో కార్మిక వారసుల గరిష్ట వయో పరిమితి 40ఏళ్లకు పెంచాం. ఇది 2018 మార్చి 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఇందుకోసం ఆయా ఏరియాల్లో దరఖాస్తు చేయాలి. అయితే, గరిష్ట వయో పరిమితితో ఉద్యోగం పొందలేని, వన్‌టైం సెటిల్‌మెంట్‌ జరగని వారికే కొత్త స్కీం వర్తిస్తుంది.  – బలరామ్, సింగరేణి సీఎండీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement