హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ  | IIT Hyderabad Introduced PhD Course In Heritage Science And Technology | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ 

Nov 20 2022 3:25 AM | Updated on Nov 20 2022 7:23 AM

IIT Hyderabad Introduced PhD Course In Heritage Science And Technology - Sakshi

ఒప్పంద పత్రాలను ప్రదర్శిస్తున్న బీఎస్‌ మూర్తి, ఎస్‌వీవైఆర్‌ఐ సంస్థ ప్రతినిధులు   

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ కోర్సును హైదరాబాద్‌ ఐఐటీ ప్రవేశపెట్టింది. ఈ మేరకు శ్రీ విశ్వేశ్వర యోగా పరిశోధన సంస్థ (ఎస్‌వీవైఆర్‌ఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశోధనలు చేసే రీసెర్చ్‌ స్కాలర్లకు ప్రతినెలా రూ.75 వేల పారితోషికంతో పాటు, విదేశాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.

హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో యోగా, ఆయుర్వేదం, సంగీతం, నృత్యం, భారతీయ భాషలు, కళలు, అర్కిటెక్చర్, శిల్పం వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రంపై హైదరాబాద్‌ ఐఐటీ డైరెక్టర్‌ ఫ్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిశోధనలో హైదరాబాద్‌ ఐఐటీ కీలక మైలురాయిని అధిగమిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌ ఐఐటీలో హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ కోర్సు ప్రవేశపెట్టామని హెరిటేజ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాధిపతి మోహన్‌రాఘవన్‌ పేర్కొన్నారు.  ఒప్పంద పత్రాలను ప్రదర్శిస్తున్న బీఎస్‌ మూర్తి, ఎస్‌వీవైఆర్‌ఐ సంస్థ ప్రతినిధులు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement