
రాయదుర్గం: ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ నూతన డైరెక్టర్‌గా సందీప్‌శుక్లా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత డైరెక్టర్ పీజే నారాయణన్ తన స్నాతకోత్సవ ఉపన్యాసంలో మాట్లాడుతూ త్వరలో డైరెక్టర్ పదవిని వదిలి అధ్యాపకుడిగా కొనసాగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన సీనియర్ ప్రొఫెసర్, ఐఈఈఈఫెలో అయిన సందీప్ కె.శుక్లా ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా గుర్తింపు పొందారు.
అమెరికాలోని ఎస్‌యూఎన్‌వై అల్బనీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సందీప్‌శుక్లా మాట్లాడుతూ ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ లాంటి అగ్రగామి సంస్థకు నూతన నాయకత్వ బా«ధ్యతలు చేపట్టే అవకాశం రావడం గర్వంగా ఉందని, ఇదొక సవాలుతో కూడిన అవకాశంగా పేర్కొన్నారు. వచ్చే నెలలో ఆయన ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు.