
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వెంకట్రామిరెడ్డి సహా టీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలన అనంతరం స్వీకరించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) శశాంక్ గోయల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసిన పి.వెంకట్రామిరెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణలు పెండింగ్‌లో ఉండటం తో కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఆయన పదవీ విరమణపై నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో ఆయన నామినేషన్ తిరస్క రించాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేశారు.