హైదరాబాద్‌: వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళకు అస్వస్థత

Hyderabad Woman Hospitalised After Taken Covid Vaccination - Sakshi

సాక్షి,  హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్‌ తీసుకున్న వారిలో కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో వాక్సిన్‌ తీసుకున్న ఏడుగురు ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలతో ఆసుత్రుల్లో సోమవారం చేరిన విషయం తెలిసిందే. తాజాగా హైదరబాద్‌లోనూ ఇలాంటి పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ రియాక్షన్ కావడంతో ఓ మహిళ గాంధీ ఆసుపత్రిలో చేరారు. జనవరి 16న నవీన అనే మహిళ ఉప్పల్‌లో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. అయితే అనుకోకుండా వంతులు, మైకం కమ్మడం, బలహీన లక్షణాలు ఏర్పడటంతో ఈ రోజు ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. ప్రస్తుతం నవీన పరిస్థితి నిలకడగా ఉందని గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. చదవండి: కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌.. ఏడుగురికి అస్వస్థత

కాగా భారతదేశమంతటా శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మహత్తర కార్యక్రమాన్ని ఉదయం 10.30 గంటలకు వర్చువల్‌ విధానం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ఇచ్చారు. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్‌ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలను అందజేశారు.మొత్తం 3 కోట్ల మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, వ్యాక్సిన్‌పై ఇతర సందేహాల నివృత్తి కోసం కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్‌ ఏర్పాటు చేసింది. 1075 నంబర్‌తో టోల్‌ఫ్రీ కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. చదవండి: కరోనా వ్యాక్సిన్‌ : మరుసటి రోజే విషాదం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top