ప్రపంచంలోకెల్లా తొలి స్మార్ట్ కాలిక్యులేటర్‌.. హైదరా­బాద్‌లో అందుబాటులోకి

Hyderabad Startup Unveils Worlds First Smart Calculator - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చిన్న, మధ్యతరహా వ్యాపా­రులకు రోజువారీ లావాదేవీలు, ఆదాయ, వ్యయాల లెక్కింపులో దోహదపడేందుకు ప్రపంచంలోకెల్లా తొలి స్మార్ట్, మేడ్‌ ఇన్‌ ఇండియా కాలిక్యులేటర్‌ పరికరం హైదరా­బాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కాలి­క్యు­లేటర్‌కు అనుసంధానంగా ఉండే టు­హ్యాండ్స్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇది పనిచే­య­నుంది. ఒక్కో లావాదేవీని యాప్‌లోకి వ్యాపారులు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా రియల్‌టైమ్‌లోనే లావాదేవీల వివరాలన్నీ ఈ పరికరంలో నిక్షిప్తం కావడం దీని ప్రత్యేకత. స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్, టీ–హబ్‌ సహకారంతో టుహ్యాండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్టార్టప్‌ కంపెనీ రూ. 50 లక్షల నిధులను సమీకరించి స్మార్ట్‌ కాలిక్యులే­టర్‌ను అభివృద్ధి చేసింది.

సోమవారం నగ­రంలోని ‘టీ–హబ్‌’లో జరిగిన కార్యక్ర­మంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్య­దర్శి జయేశ్‌ రంజన్‌ ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలను తెలం­గాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహి­స్తుందన్నారు. ఇలాంటి ఆవిష్క­రణల కోసమే టీ హబ్‌ను ప్రభుత్వం అన్ని హంగులతో ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇది జపాన్, చైనాలు తయా­రు చేసి విక్రయిస్తున్న సాధారణ కాలిక్యులేటర్ల గుత్తాధిపత్యానికి కచ్చితంగా గండికొడు­తుందని జయే­శ్‌ రంజన్‌ అభిప్రాయపడ్డారు.

టుహ్యాండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆవిష్కర్త ప్రవీణ్‌మిశ్రా మాట్లాడు­తూ ఈ కాలి­క్యు­లేటర్‌ చిన్న, మధ్యతరహా వ్యాపారుల బుక్‌ కీపింగ్‌లో పారదర్శకతను తీసుకొస్తుందన్నారు. ఆల్ఫా న్యూమరిక్‌ కీబోర్డ్‌తో కూడిన ఈ స్మార్ట్‌ కాలిక్యులేటర్‌ పవర్‌ రీచార్జ్‌ చేశాక 3 రోజులపాటు నడుస్తుందని వివరించారు. దీని ధరను రూ. 2,999గా నిర్ణయించినట్లు చెప్పారు. ఏడాది వారంటీతో పనిచేసే ఈ పరికరంలో 90 రోజుల డేటాను సులభంగా పొందొచ్చన్నా­రు. ఈ కార్య­క్రమంలో టీహబ్‌ సీఈఓ శ్రీనివాసరావు, టీఎస్‌ఐసీ సీఐఓ శాంతతౌ­తం, టుహ్యాండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆవిష్క­ర్తలు సత్యం సాహు, షణ్ముగ వడివేల్, అరవింద్‌ సుబ్రమణియన్‌ పాల్గొన్నారు.
చదవండి: సీఎం ఫాంహౌస్‌ కోసమే ‘రీజినల్‌’ అలైన్‌మెంట్‌ మార్పు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top