పుడమిని కాపాడటమే లక్ష్యం: జగ్గీ వాసుదేవ్‌

Hyderabad: Sadhguru Launches Green India Challenge 5.0 - Sakshi

శంషాబాద్‌ రూరల్‌: ‘ప్రకృతిని పరిరక్షిస్తేనే భవిష్యత్‌ ఉంటుంది. పుడమిని కాపాడడమే సేవ్‌ సాయిల్, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ సంయుక్త లక్ష్యం’ అని ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా గొల్లూరు అటవీ ప్రాంతంలో గురువారం ఆయన ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ ఐదో విడతను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారంతో పచ్చదనం పెంపు, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు.

ఎంపీ జోగినపల్లి సంతోష్‌ మాట్లాడుతూ... తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో  ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ ప్రారంభించానని, సద్గురు ఆశీస్సులు అందుకోవటం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు,

నవీన్‌రావు, విఠల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్‌ హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ ఆర్‌ఎం డోబ్రియల్, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ముచ్చింతల్‌ సమీపంలో ఉన్న సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన సద్గురు, శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామితో కలిసి ‘సేవ్‌ సాయిల్‌’ పోస్టర్లను ఆవిష్కరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top